Table of Contents Latest Ap govt jobs 2025 notification ap jobs calendar appsc | |
Organization | Andhra Pradesh Jobs Portal APPSC calendar |
Vacancy name | appsc group 1, ap group 2 jobs list, appsc group 4, appsc group 3, ap police si, AP Constable notification |
ap job calendar relesse date | jan 12 2025 |
telegram channel | AP govt jobs telegram channel |
WhatsApp group | AP govt jobs WhatsApp group |
follow on facebook page |
AP Jobs calendar 2025 vacancy details:
కొత్తగా 18 శాఖల్లో 866 పోస్టుల భర్తీపై ప్రకటన
అటవీ శాఖలో అత్యధికం
పాత నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలూ వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
అమరావతి: ఉద్యోగాల భర్తీకి ఎన్డీయే ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న ఏపీపీఎస్సీ ద్వారా ‘జాబ్ క్యాలెండర్’ను విడుదలకు చర్యలు తీసుకుంటోంది. ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ గురించి, ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తికానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇతర పోస్టుల వివరాలు
దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్, గనుల శాఖ- రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్-టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది.
ఏప్రిల్ తర్వాత గ్రూప్-1 ప్రధాన పరీక్షలు
గ్రూప్-1 ప్రధాన పరీక్షలను (నోటిఫికేషన్ 11/2023) 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్-2 ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాతపరీక్షలను 2025 జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
మరికొన్ని ఇలా..
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (పాఠశాల విద్యాశాఖ), ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఎనలిస్టు గ్రేడ్-2 (పర్యావరణ శాఖ), అసిస్టెంట్ లైబ్రేరియన్ (ఎన్టీఆర్ వర్సిటీ), జూనియర్ అసిస్టెంట్ (ఎన్టీఆర్ వర్సిటీ), ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్), లైబ్రేరియన్ (ఆరోగ్యశాఖ), అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఆర్థిక, గణాంకాల శాఖ), ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటికి 2025 మార్చి చివరి నుంచి అదే ఏడాది జూన్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించేలా తేదీల ఖరారుపై కసరత్తు జరుగుతోంది. కొత్త నోటిఫికేషన్ల జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు ఖరారుచేస్తారు.
3 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ :
ఇక వేల మంది నిరీక్షిస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రసుత్తం 100కు పైగా గ్రూప్-1, 200లకు పైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రహదారులు- భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజనాభివృద్ధి విభాగాల్లో 300లకుపైగా AE పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు APPSCకి నివేదించారు. ఆర్థిక శాఖ అనుమతిరాగానే వీటన్నింటినీ జాబ్ క్యాలెండర్‌తో కలిపి ఉద్యోగ నియామక ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. APPSCద్వారానే ఈ ఏడాదిలో 3 వేలకు పైగా కీలక ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అదే ఏడాది ముగిసేలోగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఇచ్చిన 20 నోటిఫికేషన్ల నియామకాల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసేందుకూ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్, ఏప్రిల్ తర్వాత గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. డిప్యూటీ ఈవో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, NTR వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు, ASOలు, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, టీటీడీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇవ్వగా ఈ ఏడాది జూన్‌లోగా సంబంధిత పరీక్షలన్నీ పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ ద్వారా 28 నోటిఫికేషన్స్ తో 866 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ వారీగా పోస్టుల వివరాలు:
పోస్టులు పేర్లు | ఖాళీల సంఖ్య |
అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ | 100 (30 పోస్టులు క్యారీఫార్వర్డ్) |
బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు | 691 (క్యారీఫార్వర్డ్-141-అటవీశాఖ) |
డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2-టెక్నికల్ అసిస్టెంట్ | అటవీ శాఖ – 13 |
ఠాణేదార్ (అటవీ శాఖ) | 10 |
మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ- 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ-4 | 11 |
అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ) | 10 |
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ) | 07 |
జిల్లా సైనిక్ ఆఫీసర్ | 07 |
గ్రంథ పాలకులు (ఇంటర్ విద్య) | 02 |
హార్టీకల్చర్ ఆఫీసర్ (ఉద్యానవన) | 02 |
అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యశాఖ) | 03 |
టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల) | 04 |
- AP SC ST Backlog Posts Notification updates district wise 4 days ago
- AP Staff Nurse Recruitment 2025 371 jobs zone wise notification 1 week ago
- ap home guard salary new jobs Notification updates 1 week ago
- ap panchayat secretary notification updates Salary Syllabus age limit 1 week ago
- ap mro notification 2025 salary, syllabus, eligibility group 2 1 week ago
- AP govt jobs 2025 notifications 2686 calendar updates Appsc , Ap Police, Sachivalayam etc 2 weeks ago
- ap forest department Recruitment 2025 812 jobs Notification updates 2 weeks ago
Eligibility Criteria:
Notification | qualification |
AP Sachivalayam | intermediate and 10th pass |
Group 1 | degree/B.e /MBA etc |
Group 2 | degree/B.e /MBA etc |
APPSC Group 3 recruitment | degree/B.e /MBA etc |
Group 4 | degree/B.e /MBA etc |
Panchayat secretary | degree/B.e /MBA etc |
Junior Lectures (JL) | PG |
VRO (Village Revenue Officers) | 12th -degree |
AP Police Recruitment | 12th pass or intermediate constable, degree SI |
AP Postal Recruitment | 10th |
Naval Dockyard Visakhapatnam | |
AP Customs Department | |
Vizag Steel Recruitment
| |
B.C Hostel Welfare Officers | Degree with b.ed |
AP Anganwadi Supervisors | degree, anganwadi workers 8th pass |
latest govt jobs in ap with intermediate qualification
telegram channel | AP govt jobs telegram channel |
WhatsApp group | AP govt jobs WhatsApp group |